భారత్, చైనా సరిహద్దు వివాదంపై ట్రంప్ మళ్లీ అదేమాట!

ABN , First Publish Date - 2020-09-25T15:41:53+05:30 IST

భారత్, చైనా సరిహద్దు సమస్య పరిష్కారం కోసం అవసరమైతే తాను మధ్యవర్తిత్వం..

భారత్, చైనా సరిహద్దు వివాదంపై ట్రంప్ మళ్లీ అదేమాట!

వాషింగ్టన్: భారత్, చైనా సరిహద్దు సమస్య పరిష్కారం కోసం అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. అయితే ఇరు దేశాలు తమ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోగలవని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ‘‘చైనా, భారత దేశాల మధ్య తీవ్ర ఇబ్బంది ఉందని నాకు తెలుసు. అయితే దీన్ని పరిష్కరించుకునే సామర్థ్యం వారికి ఉందని ఆశిస్తున్నాను..’’ అని వైట్‌హౌస్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. ‘‘ఒక వేళ మేము సాయం చేయాల్సి వస్తే.. అందుకు మేము సదా సిద్ధం..’’ అని ఆయన అన్నారు. లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్, చైనా మిలటరీ కమాండర్లు చర్చలు జరిపిన కొద్ది రోజులకే ట్రంప్ ఈ మేరకు పేర్కొనడం విశేషం. 

Updated Date - 2020-09-25T15:41:53+05:30 IST