సైన్యాన్ని దింపుతా!

ABN , First Publish Date - 2020-06-03T07:39:20+05:30 IST

అమెరికా అల్లర్లపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. హింసాత్మక నిరసనలను అడ్డుకోవడంలో రాష్ట్రాలు విఫలమైతే సైన్యాన్ని దింపాల్సి వస్తుంద ని హెచ్చరించారు. నల్లజాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలీసు హత్య చేయడంతో వారం రోజులుగా అమెరికాలో అల్లర్లు జరుగుతున్న...

సైన్యాన్ని దింపుతా!

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరిక.. కొనసాగిన నిరసన ప్రదర్శనలు
  • కాల్పుల్లో నలుగురు పోలీసులకు గాయాలు


వాషింగ్టన్‌, జూన్‌ 2: అమెరికా అల్లర్లపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. హింసాత్మక నిరసనలను అడ్డుకోవడంలో రాష్ట్రాలు విఫలమైతే సైన్యాన్ని దింపాల్సి వస్తుంద ని హెచ్చరించారు. నల్లజాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలీసు హత్య చేయడంతో వారం రోజులుగా అమెరికాలో అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆందోళనకారులు ఏకంగా శ్వేతసౌధాన్నే ముట్టడించడంతో ట్రంప్‌ బంకర్‌లోకి వెళ్లిపోయారు కూడా. మంగళవారం శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ట్రంప్‌ జాతినుద్దేశించి మాట్లాడారు. అల్లర్లు, లూటీలు, విధ్వంసాలు, దాడులు, ఆస్తుల ధ్వంసాన్ని అడ్డుకునేందుకు అవసరమైతే తాను వేలాది మంది సాయుధ సైనికులను రంగంలోకి దించుతాన న్నారు. ‘‘వీధుల్లో మరింతమంది నేషనల్‌ గార్డ్‌ సైనికులను మోహరించాలని గవర్నర్లకు గట్టి గా చెబుతున్నా. హింస ను అణచివేసేందుకు మేయర్లు, గవర్నర్లు భారీస్థాయిలో భద్ర తా దళాలను మోహరించాలి. ప్రజల ప్రా ణాలు, ఆస్తులను కా పాడేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందుకు ఏ నగరం లేదా రాష్ట్రమైనా నిరాకరిస్తే నేను సైన్యాన్ని దించుతా. ప్రజల సమస్యను పరిష్కరిస్తా’’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. అల్లర్లు, హింసతో తీవ్రంగా నష్టపోయిన న్యూయార్క్‌, ఫిలడెల్ఫియా, లాస్‌ఏంజెలెస్‌ వంటి నగరాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని, హింసకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. ఇవి శాంతియుత నిరసనలు కావని, దేశీయ ఉగ్రవాద చర్యలని ధ్వజమెత్తారు. ప్రజలకు భద్రత కల్పించడంలో చాలా రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ‘‘పోలీస్‌ కార్యాలయాలు, వాహనాలను నాశనం చేశారు. రాజధాని వాషింగ్టన్‌ డీసీలో లింకన్‌, రెండో ప్రపంచయుద్ధ స్మారకాలనూ ధ్వంసం చేశారు. పురాతన సెయింట్‌ జాన్స్‌ చర్చిని తగులబెట్టారు’’ అని ట్రంప్‌ చెప్పారు. లూటీదారులు, విధ్వంసకుల నుంచి ప్రజలను రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటానని, శాంతియుత నిరసనలు చేసేవారికి అండ గా ఉంటానన్నారు. ట్రంప్‌ ప్ర సంగిస్తుండగా సమీపంలో ఉన్న ఆందోళనకారులను పోలీసులు బాష్ప వాయువు, రబ్బర్‌బుల్లెట్లతో చెదరగొట్టారు. అనంతరం ట్రంప్‌ అమెరికా అటార్నీ జనరల్‌ విలియం బార్‌తో కలిసి సెయింట్‌ జాన్స్‌ చర్చిని సందర్శించారు. 





ఫ్లాయిడ్‌ కుటుంబానికి న్యాయం 

జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య పట్ల అమెరికన్లంతా బాధపడుతున్నారని ట్రంప్‌ చెప్పారు. అతని కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. ఫ్లాయిడ్‌ మృతికి కారణమైన పోలీస్‌ డెరెక్‌ చౌవిన్‌పై హత్యానేరం మోపారు. వచ్చే వారం అతన్ని కోర్టులో హాజరుపర్చనున్నారు. మరో ముగ్గురు పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించారు. మరోవైపు ఫ్లాయిడ్‌ది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేల్చారు. ఫ్లాయిడ్‌ మెడపై పోలీసు మోకాలితో నొక్కడం వల్లే చనిపోయాడని నిర్ధారించారు. అమెరికా వ్యాప్తంగా మంగళవారం కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. సెయింట్‌ లూయి్‌సలో జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీస్‌ అధికారులు గాయపడ్డారు. అయితే వారికి ప్రాణాపాయం ఏమీ లేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. న్యూయార్క్‌లో లూటీలు, విధ్వంసాలను అడ్డుకునేందుకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు గవర్నర్‌ ఆండ్రూ కోమో వెల్లడించారు. ట్రంప్‌ వివాదాస్పద ట్వీట్‌పై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఫేస్‌బుక్‌ ఉద్యోగులు సీఈవో జుకెర్‌బర్గ్‌పై ట్విటర్‌ వేదికగా తమ అసహనాన్ని వ్యక్తపరిచారు. 


ద్వేషానికి చోటు లేదు: సత్య నాదెళ్ల 

ప్రముఖ భారతీయ అమెరికన్‌ సీఈవోలు ఆఫ్రికన్‌-అమెరికన్‌ ప్రజలకు సంఘీభా వం తెలిపారు. మన సమాజంలో ద్వేషం, జా త్యహంకారానికి చోటు లేదని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ట్వి టర్‌లో పేర్కొన్నారు. బాధ, కోపం, విచారం, భయంలో ఉన్న వారందరికీ బాసటగా ఉంటామని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయీ తెలిపారు.


ట్రంప్‌.. నోరు మూసుకొని ఉంటే మంచిది!

హ్యూస్టన్‌ పోలీస్‌ చీఫ్‌ ఆర్ట్‌ అకెవెడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించా రు. నిరసనలపై ఆధిపత్యం ప్రదర్శించాలని ట్రంప్‌ గవర్నర్లను ఆదేశించడంపై అడిగిన ప్రశ్నకు ఆర్ట్‌ స్పందిస్తూ ‘‘అమెరికాలోని పోలీస్‌ చీఫ్‌లందరి తరఫున అధ్యక్షుడికి ఓమాట చెబుతున్నా. నిర్మాణాత్మకంగా మాట్లాడడం చేతకాకపోతే దయచేసి ఆయన నోరు మూసుకొని ఉం డాలి’’అన్నారు. నిరసనకారులపై జులుం ప్రదర్శించడం కాదని.. వారి హృదయాలను గెలుచుకోవాలన్నారు. నెటిజన్లు ఆర్ట్‌ను ప్రశంసలతో మంచెత్తుతున్నారు. 


కర్ఫ్యూ విధించిన నగరాలివే

అమెరికాలో రాజధాని వాషింగ్టన్‌ డీసీతో పాటు 40కి పైగా నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆదివారం నుంచి కర్ఫ్యూ ఉన్న నగరాలు..

అరిజోనా: వారం మొత్తం కర్ఫ్యూ

కాలిఫోర్నియా: లాస్‌ఏంజెలెస్‌ కౌంటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, బెవెర్లీ హిల్స్‌, శాంటా మోనికా, వెస్ట్‌ హాలీవుడ్‌, శాన్‌ జోస్‌ 

కొలరాడో: డెన్వెర్‌ 

ఫ్లోరిడా: మియామి, ఆరెంజ్‌ కౌంటీ, జాక్సన్‌విల్లే, ఓర్లాండో 

జార్జియా: అట్లాంటా 

ఇల్లినాయిస్‌: షికాగో 

ఇండియానా: ఇండియానాపోలిస్‌ 

కెంటకీ: లూయి్‌సవిల్లే 

మిషిగన్‌: డెట్రాయిట్‌ 

మిన్నెసోటా: మిన్నెపోలిస్‌, సెయింట్‌ పాల్‌ 

మిస్సోరి: కన్సస్‌ సిటీ 

న్యూజెర్సీ: అట్లాంటిక్‌ సిటీ 

న్యూయార్క్‌: రోచెస్టర్‌ 

ఒహైయో: సిన్సినాటి, క్లెవ్‌లాండ్‌, కొలంబస్‌, డేటన్‌, టోలెడో 

ఓరెగన్‌: పోర్ట్‌లాండ్‌, యూజిన్‌ 

పెన్సిల్వేనియా: ఫిలడెల్ఫియా, పిట్స్‌బర్గ్‌ 

దక్షిణ కరోలినా: చార్ల్‌స్టన్‌, కొలంబియా, మిర్ట్ల్‌ బీచ్‌ 

టెన్నెసీ: నాష్‌విల్లే 

టెక్సస్‌: డలస్‌, శాన్‌ ఆంటానియో 

యుటా: సాల్ట్‌లేక్‌ సిటీ 

వర్జీనియా: రిచ్‌మండ్‌ 

వాషింగ్టన్‌: సియాటెల్‌ 

విస్కాన్సిన్‌: మిల్వోకీ, మాడిసన్‌


స్టేట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌/ ఎమర్జెన్సీ 

అరిజోనా: ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో అల్లర్లకు కుట్ర పన్నేవారు, లూటీ చేసేవారు ఆస్తినష్టానికి కారకులను అరెస్టు చేయొచ్చు 

టెక్సస్‌: ఫెడరల్‌ ఏజెంట్లు టెక్స్‌సలో శాంతి దళాల అధికారులుగా పనిచేయొచ్చు.

వర్జీనియా: వర్జీనియా నేషనల్‌ గార్డ్‌ బలగాలు సహా అన్ని వనరులను సిద్ధం చేసుకోవచ్చు. హింసాత్మక నిరసనలను ఎదుర్కొనేందుకు నగరాల్లో మోహరించవచ్చు 

  1. షికాగోలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. 
  2. మిన్నెసోటాలోని ప్రధాన హైవేలన్నిటినీ మూసివేశారు.

Updated Date - 2020-06-03T07:39:20+05:30 IST