కుమార్తె టాప్‌లెస్ ఫొటోలు లీక్ చేసిన తల్లి?.. గతంలో ట్రంప్ సలహాదారు!

ABN , First Publish Date - 2021-01-27T06:20:53+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గంలో సలహాదారుగా పనిచేసిన కెల్లీయాన్నె కాన్వే.. తన కుమార్తె టాప్‌లెస్ ఫొటోలను ట్విట్టర్లో లీక్ చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. కాన్వే కుమార్తె క్లాడియా వయసు 16 మాత్రమే. ట్విట్టర్లో కొత్తగా

కుమార్తె టాప్‌లెస్ ఫొటోలు లీక్ చేసిన తల్లి?.. గతంలో ట్రంప్ సలహాదారు!

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గంలో సలహాదారుగా పనిచేసిన కెల్లీయాన్నె కాన్వే.. తన కుమార్తె టాప్‌లెస్ ఫొటోలను ట్విట్టర్లో లీక్ చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. కాన్వే కుమార్తె క్లాడియా వయసు 16 మాత్రమే. ట్విట్టర్లో కొత్తగా వచ్చిన ఫ్లీట్స్ ఫీచర్‌ను ఉపయోగించుకున్న కాన్వే.. ఈ ఫొటోలు లీక్ చేసినట్లు కొన్ని స్క్రీన్ షాట్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. క్లాడియా టిక్ టాక్‌లో ఓ పెద్ద స్టార్. ఆమె తల్లిదండ్రులకు, క్లాడియాకు మధ్య పెద్ద గొడవ జరుగుతోంది. ఇరువర్గాలూ కోర్టు మెట్లు కూడా ఎక్కినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో క్లాడియా టాప్‌లెస్ ఫొటోలను కాన్వే లీక్ చేయడం దుమారం రేపుతోంది.

Updated Date - 2021-01-27T06:20:53+05:30 IST