ఫోర్బ్స్ జాబితాలో 300 స్థానాలను కోల్పోయిన ట్రంప్!

ABN , First Publish Date - 2021-04-07T21:59:25+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అగ్రరాజ్య అధినేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఆస్తుల విలువ ఏకంగా 1బిలియన్ డాలర్లమేర తగ్గినట్టు అమెరికన్ ఫోర్బ్స్ మేగజైన్ స్పష్టం చేస్తోంది. 202

ఫోర్బ్స్ జాబితాలో 300 స్థానాలను కోల్పోయిన ట్రంప్!

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అగ్రరాజ్య అధినేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఆస్తుల విలువ ఏకంగా 1బిలియన్ డాలర్లమేర తగ్గినట్టు అమెరికన్ ఫోర్బ్స్ మేగజైన్ స్పష్టం చేస్తోంది. 2021కి సంబంధించి ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా విడుదలైంది. 2017కు సంబంధించిన ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఆయన 1001వ స్థానంలో ఉండగా.. 2.4 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో ట్రంప్ ప్రస్తుతం 1,299వ స్థానానికి పడిపోయారు. 2017లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాలుగేళ్ల కాలంలో ఆయన ఆస్తుల విలువ 1బిలియన్ డాలర్ల వరకు తగ్గినట్టు ఫోర్బ్స్ తెలిపింది. 


Updated Date - 2021-04-07T21:59:25+05:30 IST