ఫేస్‌బుక్ సీఈవోపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్

ABN , First Publish Date - 2021-09-12T23:06:31+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం.. ట్రంప్ మద్దతుదారులు వైట్‌హౌస్‌పై దాడికి దిగి తీవ్ర హింస సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ట్విట్టర్ ట్రంప్‌ను పూర్తిగా బ్యాన్ చేసింది. ఇక ఫేస్‌బుక్ 2023 వరకు నిషేధం విధించింది.

ఫేస్‌బుక్ సీఈవోపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్

వాషింగ్టన్: సమయం వచ్చినప్పుడల్లా ప్రత్యర్థి పార్టీలను తిట్టడం, సమయం కల్పించుకుని మరీ సోషల్ మీడియాపై దుమ్మెత్తిపోయడం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అలవాటే. తాజాగా ఫేస్‌బుక్ సీఈవో జూకర్‌బర్గ్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ పనంటూ ఈ పనంటూ వైట్ హౌజ్ చుట్టూ తిరిగిన జూకర్.. వ్యాపారం కోసం ఎంతకైనా దిగజారతారంటూ నిప్పులు చెరిగారు. 9/11 దాడికి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఫాక్స్‌ న్యూస్‌‌కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి ఇంటర్నెట్ దిగ్గజాలు అమెరికాకు చేసిందేమీ లేదని ట్రంప్ దుయ్యబట్టారు. ఇక జూకర్‌బర్గ్‌పై ట్రంప్ స్పందిస్తూ ‘‘నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన భార్యతో కలిసి జూకర్‌బర్గ్ తరుచూ వైట్ హౌస్‌కు వచ్చేవాడు. ఏదో పని కావాలంటూ అడిగేవాడు. వ్యాపారాల కోసం వాళ్లు ఎంతకైనా దిగజారతారు’’ అని అన్నారు. అంతే కాకుండా జూకర్‌ గురించి మాట్లాడుతున్న సమయంలో కొన్ని అభ్యంతకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం.. ట్రంప్ మద్దతుదారులు వైట్‌హౌస్‌పై దాడికి దిగి తీవ్ర హింస సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ట్విట్టర్ ట్రంప్‌ను పూర్తిగా బ్యాన్ చేసింది. ఇక ఫేస్‌బుక్ 2023 వరకు నిషేధం విధించింది.

Updated Date - 2021-09-12T23:06:31+05:30 IST