ఎలక్షన్ ఫ్రాడ్ గురించి పోస్ట్ చేయగానే.. క్రాష్ అయిన ట్రంప్ బ్లాగ్

ABN , First Publish Date - 2021-05-18T01:27:20+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దురదృష్టం పట్టుకున్నట్లుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలు బ్యాన్ అయ్యి సోషల్ మీడియాకు దూరమైన ఆయనకు.. తాజాగా బ్లాగ్ కూడా సమస్యలు తెస్తోంది.

ఎలక్షన్ ఫ్రాడ్ గురించి పోస్ట్ చేయగానే.. క్రాష్ అయిన ట్రంప్ బ్లాగ్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దురదృష్టం పట్టుకున్నట్లుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలు బ్యాన్ అయ్యి సోషల్ మీడియాకు దూరమైన ఆయనకు.. తాజాగా బ్లాగ్ కూడా సమస్యలు తెస్తోంది. ట్రంప్ కొత్తగా ‘ఫ్రం ది డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జె. ట్రంప్’ అనే బ్లాగ్ ప్రారంభించారు. దీనిలో ఆయన తన ఆలోచనలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో గత అధ్యక్ష ఎన్నికల్లో ఆరిజోనాలో ఎలక్షన్ ఫ్రాడ్ జరిగిందని ఒక పోస్టు చేశారు. దీనిలో కొన్ని ఆధారాలు లేని ప్రకటనలను ఈ పోస్టుకు జతచేశారు. ఇలా ఆ పోస్టు చేశారో లేదో.. ఆయన బ్లాగ్ క్రాష్ అయిపోయింది. ఈ బ్లాగ్ పోస్టు ఓపెన్ చేయబోతే ‘సమ్‌థింగ్ హాజ్ గాన్ రాంగ్ అండ్ దిస్ యూఆర్ఎల్ కెనాట్ బి ప్రాసెస్డ్ ఎట్ దిస్ టైమ్’ అనే మెసేజ్ వస్తోందిట. ఈ నెల మొదట్లోనే ఆయన సొంతగా ఒక కమ్యూనికేషన్ ప్లాట్‌ఫాంను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-05-18T01:27:20+05:30 IST