అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్ష...నెగిటివ్

ABN , First Publish Date - 2020-04-03T12:05:20+05:30 IST

అమెరికా దేశంలో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వైద్యులు రెండోసారి కరోనా పరీక్ష చేశారు.....

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్ష...నెగిటివ్

వాషింగ్టన్ డీసీ (యూఎస్ఏ): అమెరికా దేశంలో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వైద్యులు రెండోసారి కరోనా పరీక్ష చేశారు. ఈ కరోనా పరీక్షల్లో ట్రంప్ కు కరోనా నెగిటివ్ అని వచ్చింది. ‘‘ఈ రోజు ఉదయం అధ్యక్షుడు ట్రంప్‌కు కొత్త ర్యాపిడ్ పాయింట్ కేర్ సహాయంతో ఒక్క నిమిషంలోనే శాబ్స్ శాంపిల్ కలెక్షన్ చేసి మళ్లీ కొవిడ్-19 పరీక్ష చేశాం, పరీక్ష ఫలితం 15 నిమిషాల ముందే వచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారు, ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు’’ అని  వైట్ హౌస్ ఫిజీషియన్ డాక్టర్ సీన్ కాన్లీ చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ కు రెండోసారి జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని పరీక్షల్లో వచ్చిందని వైట్ హౌస్ ప్రతినిధి ప్రకటించారు. అమెరికాలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ట్రంప్ సర్కారు ఆసుపత్రులకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆసుపత్రులకు సందర్శకులను అనుమతించవద్దని సర్కారు ఆదేశించింది. అమెరికాలో ఇప్పటికే 2,42,182 మందికి కరోనా వైరస్ సోకగా, 5,850 మంది దీనివల్ల మరణించారు. 

Updated Date - 2020-04-03T12:05:20+05:30 IST