డిబేట్ తర్వాత.. ట్రంప్ చేసిన తొలి ట్వీట్ అర్థం ఇదేనా ?

ABN , First Publish Date - 2020-10-01T23:55:16+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా పరిగణించే ఇరు పార్టీ అభ్యర్థుల తొలి ముఖాముఖి చర్చ ఒహీయోలోని కీవ్‌లాండ్‌లో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం జరిగింది.

డిబేట్ తర్వాత.. ట్రంప్ చేసిన తొలి ట్వీట్ అర్థం ఇదేనా ?

తొలి డిబేట్: ట్రంప్ Vs బిడెన్ + వాలెస్

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా పరిగణించే ఇరు పార్టీ అభ్యర్థుల తొలి ముఖాముఖి చర్చ ఒహీయోలోని కీవ్‌లాండ్‌లో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం జరిగింది. ఈ డిబేట్‌కు సంధానకర్తగా ఫాక్స్ న్యూస్ పాత్రికేయుడు క్రిస్ వాలెస్ వ్యహరించారు. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చ కార్యక్రమంలో ఆది నుంచి వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యమిచ్చారు. చాలా సందర్భాల్లో బిడెన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు ట్రంప్. దీనికి బిడెన్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. 


ఇదిలాఉంటే... డిబేట్ ముగిసిన తర్వాత ట్రంప్ చేసిన తొలి ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఈ ట్వీట్‌లో ట్రంప్... బిడెన్, వాలెస్ ఫొటోలను ఒకవైపు, తన ఫొటోను మరోవైపు పెట్టి... మధ్యలో వర్సెస్(VS) అనే అక్షరాలను జోడించారు. దీంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది. దీని ప్రకారం మధ్యవర్తిగా ఉన్న వాలెస్‌.. తన ప్రత్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు బిడెన్‌ ఒకవైపు ఉంటే.. తాను ఒంటరిగా వారిని ఎదురుకున్నట్లు ట్రంప్ తెలియజేశారు. వారిద్దరూ కుమ్మక్కై తనను ఒంటరిని చేసి సంవాదాలు చేశారని అర్థం వచ్చేలా ట్రంప్ ఈ ఫొటోను ట్వీట్ చేశారు. పలు సందర్భాల్లో ట్రంప్.. వాలెస్‌తో వాదనలకు దిగిన సమయంలో కూడా "మీరు వాదించాల్సింది నాతో కాదు... మీ ప్రత్యర్థి బిడెన్‌తో" అని సంధానకర్త చురకలు అంటించడం ఈ డిబేట్‌లో జరిగింది. దీంతో ట్రంప్ ట్వీట్ మధ్యవర్తిగా వ్యవహరించిన వాలెస్... బిడెన్‌తో జతకట్టారని చెప్పకనే చెబుతోంది. పైగా వాలెస్ డెమొక్రాటిక్ అభిమాని కావడం ట్రంప్‌కు మరింతా అవకాశాన్ని ఇచ్చింది.  



Updated Date - 2020-10-01T23:55:16+05:30 IST