ట్రూఅప్‌ చార్జీలు ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2021-10-20T05:14:00+05:30 IST

రాష్ట్రప్రభుత్వం వసూలు చేస్తున్న విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీలను వెం టనే ఎత్తివేయాలని తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి రాట కొండ మధుబాబు డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజ లను మోసగిస్తున్న విధానాన్ని వివరిస్తూ బి.కొత్త కోటలో మంగళవారం టీడీపీ నేతలు ఇంటింటా కర పత్రాలు పంపిణీ చేశారు.

ట్రూఅప్‌ చార్జీలు ఎత్తివేయాలి
చీకిలబైలులో విద్యుత్‌బిల్లులతో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

టీడీపీ నాయకుల నిరసన


కరపత్రాల పంపిణీ


మదనపల్లె టౌన్‌, అక్టోబరు 19: రాష్ట్రప్రభుత్వం వసూలు చేస్తున్న విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీలను వెం టనే ఎత్తివేయాలని తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి రాట కొండ మధుబాబు డిమాండ్‌ చేశారు. మంగళవారం మదనపల్లె మండలంలోని చీకిలబైలు సర్పంచ్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ... కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయలేని వైసీపీ ప్రభు త్వం ఇప్పుడు ట్రూఅప్‌ చార్జీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. వ్యవసాయానికి 9గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తామని చెబుతున్నారే కానీ క్షేత్ర స్థాయిలో కోతలు విధిస్తున్నారన్నారు.టీడీపీ రాజంపేట పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి దొరస్వామినాయుడు మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం నియంతపాలనలో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. అదేమని ప్రశ్నిస్తే పోలీసు కేసులు బనాయిస్తున్నారన్నారు. రాజం పేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేష్‌ మాట్లాడుతూ... టీడీపీ పాలనలో కరెంటు చార్జీలు పెంచలేదని, ఇప్పుడు జగన్‌ రాష్ట్రాన్ని అంధకారంలో ముంచుతున్నారన్నారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ అందిస్తానన్న జగన్‌ హామీ అమలు కా లేదన్నారు. అనంతరం గ్రామీణులతో కలసి విద్యుత్‌ బిల్లులతో నిరసన తెలిపారు. కార్యనిర్వాహక కార్యదర్శి పఠాన్‌ఖాదర్‌ఖాన్‌, మురళి తదితరులు పాల్గొన్నారు.


కరపత్రాల పంపిణీ...


బి.కొత్తకోట: వైసీపీ ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజ లను మోసగిస్తున్న విధానాన్ని వివరిస్తూ  బి.కొత్త కోటలో మంగళవారం టీడీపీ నేతలు ఇంటింటా కర పత్రాలు పంపిణీ చేశారు. విద్యుత్తు రంగంలో ప్రభు త్వం అనుసరిస్తున్న విధానాలు, కరెంటు బిల్లుల రూ పంలో ప్రజలపై వేస్తున్న భారాన్ని వివరిస్తూ బిల్లులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇందులో భాగంగా కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి  పర్వీన్‌తాజ్‌ మాట్లా డుతూ... రాష్ట్రం అప్పుల్లో ముందుండగా, ఆదాయం లో పాతాళానికి పడిపోయిందని విమర్శించారు. రాష్ట్రా న్ని అంధకారంలోకి నెట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కు తుందన్నారు. టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి మొటుకు శివ, డేరింగుల నారాయణ, చావిడి కిట్టన్న, రవికుమార్‌, ఆంజనేయులు, మదర్‌ సాహెబ్‌, గట్టుచంద్రన్న, నారాయణస్వామి, మస్తాన్‌రెడ్డి, ఇ.శ్రీరాములు, వెంకటరమణ, నాగరాజు, అశోక్‌ కుమార్‌, శీనప్ప, శంకర తదితరులు పాల్గొన్నారు.


కురబలకోట: ఇష్టాను సారంగా విద్యుత్‌ చార్జీలను పెం చితే ప్రజలు బతికెదెట్లా అని రాజంపేట పార్లమెంటరీ టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌, రాజంపేట పార్లమెంటరీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయూబ్‌బాషా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ట్రూ అప్‌ పేరిట  విద్యుత్‌ చార్జీలను పెంచ డాన్ని నిరసిస్తూ  అంగళ్లులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. రాష్ట్రంలో కుప్పకూలిన విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెట్టి ట్రూ అప్‌ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-10-20T05:14:00+05:30 IST