హైదరాబాద్ సిటీ/పీర్జాదిగూడ : టీఆర్‌ఎస్ పార్టీకి పీర్జాదిగూడ సీనియర్ నాయకులు తీగల రంగన్నగౌడ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు దుర్గా దయాకర్‌రెడ్డికి పంపిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. రెండు రోజుల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు రంగన్నగౌడ్ వెల్లడించారు.