ప్రభుత్వం 1 లక్ష 36 వేల ఉద్యోగాలు ఇచ్చిందని లెక్కలతో సహా ఉన్నాయి: కేకే

ABN , First Publish Date - 2021-02-27T22:18:26+05:30 IST

టి.ఆర్.ఎస్ ప్రభుత్వం 1 లక్ష 36 వేల ఉద్యోగాలు ఇచ్చిందని లెక్కలతో సహా ఉన్నాయని, ఇవ్వలేదని నిరూపిస్తే తాను స్వచ్చందంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని టీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరారు. శనివారం బేగంపేట లోని జురాస్టియన్ ఫంక్షన్ హాల్ లో

ప్రభుత్వం 1 లక్ష 36 వేల ఉద్యోగాలు ఇచ్చిందని లెక్కలతో సహా ఉన్నాయి: కేకే

హైదరాబాద్: టి.ఆర్.ఎస్ ప్రభుత్వం 1 లక్ష 36 వేల ఉద్యోగాలు ఇచ్చిందని లెక్కలతో సహా ఉన్నాయని, ఇవ్వలేదని నిరూపిస్తే తాను స్వచ్చందంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని టీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరారు. శనివారం బేగంపేట లోని జురాస్టియన్ ఫంక్షన్ హాల్ లో సనత్ నగర్ నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశం  పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన జరిగింది.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఏ శాఖల లో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందో ప్రభుత్వం పక్కా లెక్కలతో తెలిపిందని, ఇంకా అనుమానులు ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వ లెక్కలు తప్పని రుజువు చేస్తే ఈ వేదికపై ఉన్న వారందరూ రాజీనామాలు చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు. హైదరాబాద్ – రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్సీ అభ్యర్ధి సురభి వాణిదేవి కి మద్దతుగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అభ్యర్ధి సురభి వాణిదేవి, ఎంఎల్సీ ఎన్నికల హైదరాబాద్ జిల్లా ఇంచార్జి, మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, జీహెచ్ఎంసి  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, విద్యావేత్త పీఎల్ శ్రీనివాస్, క్రీడాభివృద్ది సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, నియోజకవర్గంలోని కార్పొరేటర్లు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు కేశవరావు మాట్లాడుతూ మొత్తం 5 లక్షల 5 వేల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటే అందులో 3 లక్షల మంది మనం గుర్తించిన వాళ్లేనని చెప్పారు. ఓటరుగా నమోదు తో మన బాద్యత అయిపోలేదని, పోలింగ్ బూతు వరకు ఓటర్ లను తీసుకెళ్ళడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అప్పుడే మన లక్ష్యాన్ని చేరుకోగాలమనే విషయాన్ని ప్రతి కార్యకర్త గుర్తుంచుకోవాలని చెప్పారు. ఎం.ఎల్.సి ఎన్నికల ముందు ప్రతిపక్షాలు అనవసరంగా ఉద్యోగ భర్తీలపై పి.ఆర్.సి, ప్రమోషన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ఇంచార్జి, మంత్రి గంగుల కమలాకర్  మాట్లాడుతూ దేశ ప్రధానిగా దివంగత పీవీ నరసింహారావు భారతదేశ గౌరవాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్పారని, దేశ అభివృద్ధి లో కీలక పాత్ర పోషించారని అన్నారు.




అటువంటి మహోన్నత వ్యక్తీ కూతురు  సురభి వాణిదేవి గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని, అదే మనం నరసింహారావుకి నిజమైన నివాళులు అరిపించినట్లు అని అన్నారు. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 30 సంవత్స రాలు నుండి ప్రమోషన్స్. కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు  ప్రమోషన్స్ ఇచ్చింది తెలంగాణా ప్రభుత్వం అని అన్నారు. దేశ చరిత్ర లోనే  మొదటి సారి 1 లక్ష 32 వేల 980 ఉద్యోగాలు భర్తీ చేసిది టీఆర్ఎస్ ప్రభుత్వమేన్నారు. 

Updated Date - 2021-02-27T22:18:26+05:30 IST