తెలంగాణలో అవినీతి మంత్రులు లేరు : సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-04-27T17:51:33+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి మంత్రులు లేరని సీఎం కేసీఆర్‌ అన్నారు. అవినీతి రహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని

తెలంగాణలో అవినీతి మంత్రులు లేరు : సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి మంత్రులు లేరని సీఎం కేసీఆర్‌ అన్నారు. అవినీతి రహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.హైచ్ఐసీసీలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో బుధవారం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు- రంగారెడ్డిని పూర్తి చేసుకుంటే రాష్ట్రం మరింత సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఎందరో మహానుభావులు, శ్రేణుల కష్టమే టీఆర్‌ఎస్‌కు ఈ విజయం సాధించి పెట్టిందని తెలిపారు. కర్నాటకలో అవినీతికి పాల్పడిన ఒకరు మంత్రి పదవి కోల్పోయారని, ఆ పరిస్థితి తెలంగాణలో రాదన్నారు. ధరణి ద్వారా రైతులు, భూ యాజమాన్య సమస్య తీరిందని తెలిపారు. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నామన్నారు. పలు పెద్ద రాష్ట్రాలను అధిగమించి మన తలసరి ఆదాయం రూ.2,78,000ని  రెట్టింపు కంటే ఎక్కువగా చేసుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు 3 మెడికల్‌ కాలేజీలుంటే ఇప్పుడు 33కు పెంచామని తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కూడా ఇచ్చామన్నారు. తెలంగాణను జీరో ఫ్లోరైడ్‌ రాష్ట్రంగా నిలిపామని కేసీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2022-04-27T17:51:33+05:30 IST