హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్‌పై న్యాయపోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గెజిట్ నోటిఫికేషన్ వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయంపై పార్లమెంటులోనూ గళమెత్తాలని నిర్ణయించారు. పార్లమెంట్లో అంశాలవారీగా పార్టీ అభిప్రాయం చెబుతూనే తెలంగాణకు ఇచ్చిన హామీలపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలు, విభజన హామీలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఎంపీ లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతోందని ఆయన అన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నోటిఫికేషన్ విషయమై న్యాయనిపుణులు, అధికారులతో కేసీఆర్ చర్చిస్తున్నారని లింగయ్యయాదవ్ తెలిపారు.