TRS NRI Kuwait: గల్ఫ్ కార్మికుడిని స్వదేశానికి పంపడంలో చేయూత

ABN , First Publish Date - 2022-03-22T13:16:50+05:30 IST

నిజామాబాద్ జిల్లా వాసి కట్టె దుర్గాపతి ఐదేళ్లుగా కువైత్‌లోని వఫ్రా ప్రాంతంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

TRS NRI Kuwait: గల్ఫ్ కార్మికుడిని స్వదేశానికి పంపడంలో చేయూత

ఎన్నారై డెస్క్: నిజామాబాద్ జిల్లా వాసి కట్టె దుర్గాపతి ఐదేళ్లుగా కువైత్‌లోని వఫ్రా ప్రాంతంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన కాంట్రాక్ట్ ముగియడంతో అతను స్వదేశానికి వెళ్తానని తన అరబ్ యజమానితో చెప్పాడు. కానీ, యజమాని అందుకు నిరాకరించాడు. దాంతో తన మిత్రుడు మల్లేష్ ద్వారా టీఆర్ఎస్ ఎన్నారై కువైత్ అధ్యక్షురాలు అభిలాషను కలిశాడు. ఆమెను కలిసి తన సమస్యను వివరించడంతో పాటు తనను ఎలాగైనా తనను ఇండియాకి పంపించాలని కోరడం జరిగింది.


అతని అభ్యర్థనకు వెంటనే స్పందించిన అభిలాష.. దుర్గాపతిని ఎంబసీకి రప్పించి మదథ్‌లో ఫిర్యాదు చేయించారు. ఈ సందర్భంగా భారత రాయబారితో అతని సమస్యను వివరించి ఎంబసీ తక్షణ సహాయం కింద షెల్టర్ కూడా ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత మిశ్రేఫ్, అహ్మదిలోని షూన్ ఆఫీసులలో కంప్లైంట్స్ చేసి తదుపరి ప్రాసెస్ అంతా పూర్తి చేపించి స్వదేశానికి పంపించడం జరిగింది. ఈ విషయంలో అడగగానే తక్షణమే స్పందించిన ఇండియన్ అంబాసిడర్ సిబి జార్జ్, ఎంబసీ సిబ్బందికి అభిలాష గొడిశాల ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే కువైత్‌లో ప్రవాసులు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న తన వంతు సహాయం అందించడానికి తనతో పాటు తన టీమ్ కూడా ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.

Updated Date - 2022-03-22T13:16:50+05:30 IST