బకాయిలు విడుదల చేయండి

ABN , First Publish Date - 2020-09-22T08:14:15+05:30 IST

తెలంగాణాకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేశ్‌ నేత విజ్ఞప్తి చేశారు...

బకాయిలు విడుదల చేయండి

  • వెంకటేశ్‌ నేత

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణాకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేశ్‌ నేత విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో సోమవారం ఆయన మాట్లాడారు.  జీఎస్టీ బకాయిలు రూ.9 వేల కోట్లు ఇస్తే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన రూ.450 కోట్లతో పాటు ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధులు కూడా రావలసి ఉన్నట్లు తెలిపారు.  కరోనా సంక్షోభంలో రాష్ట్రాలకు మరింత ఆర్థిక సహకారం అందించి అండగా నిలవాలని కోరారు.

Updated Date - 2020-09-22T08:14:15+05:30 IST