ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్: ఎంపీ నామా

ABN , First Publish Date - 2022-02-01T22:23:53+05:30 IST

పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్, వ్యవసాయ

ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్: ఎంపీ నామా

ఢిల్లీ: పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్, వ్యవసాయ వ్యతిరేక బడ్జెట్, ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్ అని టీఆర్‌ఎస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో తమ రాష్టానికి ఏముంటుందని అందరూ ఎదురుచూస్తుంటారన్నారు. అమృత్ కాల్ బడ్జెట్ అని వచ్చే 25 ఏళ్ళకి అంటున్నారని, కానీ ఈరోజు చస్తున్నామని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ రంగాలను చంపేస్తున్నారని, అమ్మే అన్ని సంస్థలను లైన్‌లో పెట్టారని ఆయన ఆరోపించారు. బడ్జెట్ విధానంపై అంశంలో గ్రామస్థాయిలో కూడా చర్చ జరగాలన్నారు. కనీసం రైతులకు కూడా న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రికల్చర్‌లో డిజిటిల్ అని అంటున్నారని, అసలు ఏంటి ఇది అని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ తీరు చాలా బాధగా అనిపించిందన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉందన్నారు. కరోనాలో కూడా వ్యవసాయం బాగుంది కాబట్టే మనకు ఆదాయం ఉందని ఆయన తెలిపారు.


బడ్జెట్‌లో గుజరాత్ గిఫ్ట్ సిటీ గురించి మాత్రం మాట్లాడుతారన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌కి కూడా గిఫ్ట్ సిటీ ఇవ్వాలని ఆయన కోరారు. గిఫ్ట్ సిటీ ఇవ్వడానికి దేశంలో ఇంకా ఏ రాష్ట్రం లేదా అని ఆయన ప్రశ్నించారు. ల్యాండ్స్ రికార్డు అంటున్నారు, ఢిల్లీ నుంచి కంట్రోల్ చేయాలని చూస్తున్నారా అని ఆయన నిలదీశారు. ధాన్యంపై పార్లమెంట్లో తాము ఆందోళన చేశామన్నారు. బడ్జెట్ వలన ర్రాష్టాలకు వచ్చేది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. 

Updated Date - 2022-02-01T22:23:53+05:30 IST