ఢిల్లీ: ధాన్యం కొనుగోలు విషయంలో కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల ఎంపీలందరం కలిసి జాయింట్‌గా నిరసన తెలుపుతామని టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ కేశవరావు తెలిపారు. తెలంగాణ రైతుల సమస్యలను కేంద్రమంత్రికి వివరించామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గింజా కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చి ఇప్పుడు దానిని నెరవేర్చడం లేదని ఆయన ఆరోపించారు.