హైదరాబాద్: రాష్ట్రంలో పోడు భూముల సమస్యపై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పోడు భూముల చట్టాలన్నీ బీజేపీ రూపొందించినవేనని ఆయన తెలిపారు. పోడు భూములపై చట్టం చేయాల్సింది పార్లమెంట్ అని ఆయన పేర్కొన్నారు. అక్కడ చేయాల్సింది చేయకుండా ఇక్కడ పోరాటం అంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇక్కడ గొడవలు పెట్టే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీవి కేవలం మాటలేనని, చేతలు కావని ఆయ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో13 లక్షల ఎకరాలకు నాలుగన్నర లక్షల మంది పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. మీకు దమ్ముంటే పట్టాలు ఇచ్చే అనుమతి ఇవ్వగలరా అని ఆయన నిలదీశారు. పోడు భూమలకు హక్కు కావాలి అని పార్లమెంట్లో బండి సంజయ్ అడగాలని ఆయన సవాల్ విసిరారు. గిరిజనులు ఇప్పుడు ఓటు బ్యాంక్ కాదన్నారు. బీజేపీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక చర్యలను గిరిజనులు దళితులు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అర్ఓఎఫ్ అర్ చట్టంలో మార్పులు తీసుకు రావాలని ఆయన కోరారు. బీజేపీకి దమ్ముంటే జీఓ3ను పునరుద్ధరించాలని ఆయన సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి