TS news: ఈటల... కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు: కౌశిక్ రెడ్డి

ABN , First Publish Date - 2022-07-26T16:54:40+05:30 IST

బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌(Etela rajendar)పై టీఆర్ఎస్‌(TRS) ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి(Koushik reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

TS news: ఈటల... కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు: కౌశిక్ రెడ్డి

కరీంనగర్: బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌(Etela rajendar)పై టీఆర్ఎస్‌(TRS) ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి(Koushik reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరన్నారు. హుజురాబాద్‌లో ఈటలకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. సీఎం మీద కాదు హుజురాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలన్నారు. హుజురాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా ఈటలా అంటూ సవాల్ విసిరారు. ఉప ఎన్నిక తర్వాత హుజురాబాద్‌లో లక్ష రూపాయల అభివృద్ధి అయిన చేశారా అంటూ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. 

Updated Date - 2022-07-26T16:54:40+05:30 IST