హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మా సీఎం కేసీఆర్‌ను మించిన తెలివైన సీఎం దేశంలో ఎవరూ లేర"న్నారు. బీజేపీ అనేది పార్టీ కాదని, గుజరాత్ కంపెనీ అని ఆయన పేర్కొన్నారు. రైస్ ఎగుమతి చేసుకునే స్వేచ్ఛ తమకు ఇవ్వాలని ఆయన కోరారు. తామే కొని విదేశాలకు ఎగుమతి చేస్తామని ఆయన తెలిపారు.