Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేను లోటస్‌పాండ్‌కు పోలేదు: TRS MLA Rajaiah

హైదరాబాద్: తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య భేటీ అయ్యారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై సోమవారం మీడియాతో మాట్లాడిన రాజయ్య తాను లోటస్‌పాండ్‌కు వెళ్లలేదని చెప్పారు. బ్రదర్ అనిల్‌ను కలవలేదని క్లారిటీ ఇచ్చారు. పాత ఫొటోలతో పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. అసత్య ప్రచారాలు చేసి మనసు గాయపర్చవద్దని విన్నవించారు. ‘‘నా జీవితాంతం టీఆర్ఎస్‌లోనే ఉంటా. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయేలా కేసీఆర్ నాకు భిక్ష పెట్టారు. మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేకపోయారు కాబట్టే కేసీఆర్ దళిత ఎంపవర్‌మెంట్ తెచ్చారు’’ అని రాజయ్య చెప్పారు.

కడియం నాకు ఆదర్శం

‘‘కడియం శ్రీహరి, నేను ఒకే జాతి బిడ్డలం. అందుకే మా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఆయన రెండు సార్లు గెలిస్తే నేను నాలుగు సార్లు గెలిచా. కొన్ని విషయాల్లో నేను కడియం శ్రీహరిని ఆదర్శంగా తీసుకుంటా. అందుకే నేను గురువును మించిన శిష్యుడినయ్యా’’ అంటూ కడియంతో తనకున్న భావసారూప్యతను రాజయ్య పంచుకున్నారు.

Advertisement
Advertisement