Abn logo
Dec 3 2020 @ 09:32AM

నోముల నర్సింహయ్య అంతిమయాత్ర ప్రారంభం

నల్లగొండ:  అనారోగ్యంతో కన్నుమూసిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంతిమయాత్ర గురువారం ఉదయం నకిరేకల్‌లో ప్రారంభమైంది. మెయిన్ రోడ్ నుంచి అంతిమయాత్ర సాగుతోంది. స్వగ్రామం పాలెంలోని వ్యవసాయ క్షేతంలో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నోముల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమ నేతకు తుది వీడ్కోలు పలికేందుకు భారీగా అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కదలివచ్చారు. నోముల మృతి పట్ల సీఎం కేసీఆర్ సహా పార్టీ నేతలు, కార్యకర్తలు, సీపీఎం నేతలు సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు. 


మరోవైపు నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 10:50గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు బయలుదేరనున్న సీఎం...11:25గంటలకు హెలికాప్టర్‌లో పాలెం గ్రామానికి చేరనున్నారు. ఎమ్మెల్యే నోముల అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చి 12 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు ప్రయాణంకానున్నారు. సీఎం రాక నేపథ్యంలో  ఉన్నతాధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement