హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్ : ముషీరాబాద్ డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవి కాడబోయిన నర్సింగ్‌ప్రసాద్‌కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న స్థానిక నేతలను ఎమ్మెల్యే ముఠా గోపాల్ బుజ్జగించి శాంతింపజేశారు. ఆదివారం ముషీరాబాద్ డివిజన్‌లోని టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సాంబశివరావు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్న నేతలను సముదాయిస్తూ అసంతృప్తి వీడి కలిసిపనిచేయాలని, అందరికీ న్యాయం చేస్తామని సూచించారు.
సోమవారం మరోసారి ఈ విషయంపై మాట్లాడతానని డివిజన్ మాజీ అధ్యక్షుడు భిక్షపతియాదవ్, పదవులను ఆశించిన లక్ష్మణ్‌గౌడ్, శ్రీధర్‌రెడ్డిలకు సర్ధిచెప్పారు. సీనియర్ నాయకులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవి లభించక తీవ్ర అసంతృప్తితో ఉన్న దీన్‌దయాల్‌రెడ్డిని టీఆర్‌ఎస్ యువజన విభాగం నగర నాయకుడు ముఠా జైసింహ ఆదివారం అతని ఇంటికి వెళ్లి బుజ్జగించారు.