హైదరాబాద్: బీజేపీ జాతీయ నేత జేపీ నడ్డాపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ లీడర్లు.. గల్లీ లీడర్లు రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారని అన్నారు. జేపీ నడ్డా సీఎం కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని... లేకుంటే బెంగాల్‌లో మాదిరిగా ఉరికించి కొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిల్లర మాటలు మాట్లాడితే.. ఉన్న మూడు సీట్లు కూడా పోతాయన్నారు. బండి సంజయ్, అరవింద్‌పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. జేపీ నడ్డా ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హితవుపలికారు.
ఇవి కూడా చదవండి