తెలంగాణ అభివృద్ధికి రేవంత్‌రెడ్డి, అర్వింద్ అడ్డుపడుతున్నారు: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-04-22T23:20:22+05:30 IST

తెలంగాణ అభివృద్ధికి టీపీసిసి ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బజెపి ఎంపీ అర్వింద్ అడ్డుపడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ పీయూసీ కమిటీ ఛైర్మన్ జీవన్ రెడ్డి ఆరోపించారు

తెలంగాణ అభివృద్ధికి రేవంత్‌రెడ్డి, అర్వింద్ అడ్డుపడుతున్నారు: జీవన్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి టీపీసిసి ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బజెపి ఎంపీ అర్వింద్ అడ్డుపడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ పీయూసీ కమిటీ ఛైర్మన్ జీవన్ రెడ్డి ఆరోపించారు. అర్వింద్ స్టంట్‌ మాస్టర్ అయితే రేవంత్‌ టెంట్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. శుక్రకవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారిపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. అరవింద్ అంటేనే సన్ ఆఫ్ కరెప్షన్ అని, ఇక అర్వింద్‌కు దమ్ముంటే కేటీఆర్‌ సవాల్‌ స్వీకరించాలని డిమాండ్ చేశారు. బిజేపీకి చెందిన ఆ ముగ్గురు నహీ మాలుమ్ ఎంపీలని అన్నారు. చిల్లర, చిచోరా ,చీప్ క్వాలిటీ గాళ్లుగా అభివర్ణించారు. ఢిల్లీకి బానిసలై అభివృద్ధిని అడ్డుకుంటున్నరని ఆరోపించారు. కేటీఆర్ సింహం లాంటోళ్లని,వీళ్ళు ఊరకుక్కలని విమర్శించారు.


 కేటీఆర్ అభివృద్ధి కి అంబాసిడర్ అయితే ఈ ముగ్గురు కేటుగాళ్లకు అంబాసిడర్లని అన్నారు. ఒకడు తిరుగుబోతు, ఇంకొకడు వాగుబోతు,మరొకడు ఆంబోతు అంటూ విమర్శించారు. ఎంపీ అరవింద్ దొంగ,దగుల్బాజీ, డెకాయిట్ అని అసలు ఆయన హిందువుకాదని,,రాజకీయ రాబంధుగా పేర్కొన్నారు. ఎంపీ అరవింద్ ఎల్లమ్మతల్లిని అవమానిస్తావా? నీకు దమ్ముంటే కేటీఆర్ సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇక రేవంత్ చంద్రబాబుకు చెప్రాసి అని అన్నారు. నీ ఇంటి పేరు అనుముల కాకుండా ఆంబోతు అని మార్చుకో అంటూ విమర్శించారు."కేసీఆర్, కేటీఆర్, కవితలపై నోరు జారితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. బట్టలూడదీసి ఉరికించి కొడతామని అన్నారు. 

Updated Date - 2022-04-22T23:20:22+05:30 IST