నల్గొండ: దేశంలో ఎరువుల ధరలు పెరిగితే ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్ డిమాండ్ చేశారు. శాలిగౌరారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల పక్షాన సీఎం కేసీఆర్ లేఖను సంధించారని ఆయన తెలిపారు. 2016లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రసంగాలు చేసిన మోదీ ఆదాయాన్ని కాకుండా వ్యపసాయ పెట్టుబడిని రెట్టింపు చేసిండని ఆయన ఆరోపించారు. ఎరువుల ధరలు పెరిగితే రైతులపై పెనుభారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి