కేటీఆర్ కుమారుడిపై ట్వీట్‌ను ఖండిస్తున్నా: Balka suman

ABN , First Publish Date - 2021-12-25T19:44:59+05:30 IST

మంత్రి కేటీఆర్ కుమారుడి గురించి తీన్మార్ మల్లన్న చేసిన ట్వీట్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కేటీఆర్ కుమారుడిపై ట్వీట్‌ను ఖండిస్తున్నా: Balka suman

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కుమారుడి గురించి తీన్మార్ మల్లన్న చేసిన ట్వీట్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తీన్మార్ మల్లన్న కేటీఆర్ కుమారుని మీద పెట్టిన ట్వీట్‌ను ఖండిస్తున్నామన్నారు. పిల్లల్ని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని మండిపడ్డారు. దీని వెనుక బీజేపీ ఉందని... బండి సంజయ్ ఉన్నారని... ఇది ఆ పార్టీ సంస్కృతి అని ఆరోపించారు. బీజేపీ నాయకులకు చెప్పు దెబ్బలు తగులుతాయని హెచ్చరించారు.


‘‘నవీన్ పద్ధతి మార్చుకోవాలి, లేదంటే చెప్పుదెబ్బలు తప్పవు. మీరు ఏమీ చేసినా చూస్తూ ఊరుకోవడానికి మా పార్టీ సిద్ధంగా లేదు. నేను వందల కోట్ల ఆస్తులు సంపాదించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి చీము నెత్తురు ఉంటే నాకు ఐటీ రిటర్న్స్ సమర్పిస్తున్న ఆస్తులకంటే ఎక్కువ ఉన్నట్లు నిరూపించండి’’ అంటూ ఆయన సవాల్ విసిరారు.


దీనిపై రాష్ట్ర డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీస్ డిపార్ట్ మెంట్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎక్కడైనా ఏదైనా జరిగితే తమకు సంబంధం లేదని అన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 8 లక్షల 72వేల ఉద్యోగాలు ఇవ్వకుండా మోడీ గడ్డిపీకుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే బండి, అరవింద్, కిషన్ రెడ్డి బొగ్గు బ్లాకుల వేలం ఆపాలని బాల్క సుమన్ సవాల్ విసిరారు. 

Updated Date - 2021-12-25T19:44:59+05:30 IST