కాంగ్రెస్ పార్టీ దివాలా స్థితిలో వుంది- టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

ABN , First Publish Date - 2022-04-22T22:27:13+05:30 IST

కాంగ్రెస్ పార్టీ చాలా దివాలా స్థితిలో వుంది... ఆపార్టీ శవయాత్ర జరుగుతోంది...అంటూ పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ దివాలా స్థితిలో వుంది- టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చాలా దివాలా స్థితిలో వుంది... ఆపార్టీ శవయాత్ర జరుగుతోంది...అంటూ పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎద్దేవా చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో వుంటే ఆ పార్టీ భూ స్ధాపతితేనని అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రైతుబంధు సమితి ప్రెసిడెంట్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, ఎల్. రమణ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ బీజేపీ లో ఉంటే బీజేపీ లేవలేదు..టీ ఆర్ ఎస్ నుంచి రేవంత్ వెళ్ళగానే పార్టీ బాగుపడ్డది.టీడీపీ రేవంత్ తో ఖతమైంది..కాంగ్రెస్ పార్టీకి రేవంత్ కు ముందు కొన్ని సీట్లు వచ్చాయి.ఇపుడు రేవంత్ అధ్యక్షుడిగా ఉంటే కాంగ్రెస్ కు వచ్చేవి సున్నా స్థానాలే.. రాసి పెట్టుకోండి...అంటూ జోస్యం చెప్పారు. 


టీడీపీ లో మేము తెలంగాణ కోసం కొట్లాడుతుంటే రేవంత్ చంద్రబాబు ఏజెంట్ గా పనిచేశారు...రేవంత్ ఎక్కడ కాలు పెడితే అక్కడ భూస్థాపితమే...కాంగ్రెస్ లోనే రేవంత్ కు ఎవ్వరూ విలువ నివ్వడం లేదు.. బయట ఇంకెవ్వరైనా ఇస్తారా..తెలంగాణ కోసం రేవంత్ చేసింది ఏమైనా ఉందా...కాంగ్రెస్ హాయం లో సాగు నీరు తాగు నీటి కి కటకట ఉండేది..ఇపుడు తెలంగాణ లో ఆ సమస్యలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు.తెలంగాణ ను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. రైతు ల కోసం పని చేసింది ఇద్దరే ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఒకరు ఎన్ఠీఆర్ మరొకరు కేసీఆర్ అన్నారు.రేవంత్ లాంటి చిల్లర గాళ్ల వాళ్ళ రైతులకు అన్యాయం జరుగుతోంది..ఇకనైనా రేవంత్ భాష ను మార్చుకోవాలని హితవు పలికారు.

 

పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం సేకరణ జరగకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు..మేము జోకిన బియ్యానికి ఎఫ్సీఐ డబ్బులు ఇస్తుంది.. ఇందులో గోల్ మాల్ కు ఆస్కారం ఎక్కడిది? చేతనైతే రాష్ట్రానికి జరిగే 3 వేల కోట్ల నష్టాన్ని కేంద్రం తో పూడ్చే ప్రయత్నం కిషన్ రెడ్డి చేస్తే మంచిదని అన్నారు.కిషన్ రెడ్డి తీరు ఇలానే ఉంటే రాజకీయంగా నూకలు చెల్లేలా చేస్తామని హెచ్చరించారు.తెలంగాణ వ్యతిరేకి గా ముద్రపడ్డ కిషన్ రెడ్డి మరింత వ్యతిరేకత మూట కట్టుకోవద్దు...రేవంత్ రెడ్డి బ్లాక్ మెయి లింగ్ గురించి జూబిలీ హిల్స్ లో మనుషులతో పాటు రాళ్ళ ను అడిగినా చెబుతాయని అన్నారు. పైసలు కట్టి పీసీసీ పదవి తెచ్చుకుంది ఎవరో అందరికీ తెలుసు.రైతు సంఘర్షణ సభ కాదు కాంగ్రెస్ సంఘర్షణ సభ అని పేరు పెట్టుకో అంటూ ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-04-22T22:27:13+05:30 IST