Abn logo
Sep 27 2020 @ 00:49AM

రూ.50వేల కోట్ల రాబడి తగ్గింది

Kaakateeya

మండల సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌లో రూ.కోటీ 85లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభం 


ఘట్‌కేసర్‌ రూరల్‌/ఘట్‌కేసర్‌: కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రూ.50వేల కోట్ల రాబడి తగ్గిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన ఘట్‌కేసర్‌ మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.   గుర్తుచేశారు. గత ఆరున్నర యేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో  అభివృద్ధి చెందిందని తెలిపారు. గ్రామాలన్నీ పచ్చదనంతో విరాజిల్లుతున్నాయని, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రజాప్రతినిధులు కృషిచేస్తున్నారని తెలిపారు.గ్రామకంఠాలు, ప్రభుత్వ స్థలాలలో ఇళ్లు నిర్మించుకొని ఇంటి నెంబర్లు పొందిన నిరుపపేదల కోసం ముఖ్యమంత్రి 58, 59 జీవోలు ప్రవేశపెట్టి త్వరలో క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపారు. ఎల్‌ఆర్‌ఎ్‌సను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 


పోడియం ఎదుట బైఠాయించిన ఎంపీటీసీలు 

మంత్రి సమావేశం నుంచి వెళ్లగానే ఎంపీటీసీ సభ్యులు తాము గెలిచి ఏడాది అవుతున్నా ప్రభుత్వ నిధులు ఇవ్వడం లేదని పోడియం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశానికి వచ్చి చాయ్‌ తాగి, బిస్కెట్లు తిని వెళ్లాలా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ సభ్యులు సమావేశం జరుగుతుండగానే సగంలోనే బహిష్కరించి బయటకు వచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, వైఎస్‌ ఎంపీపీ జంగమ్మ, సింగిల్‌ విండో చైర్మన్‌ రామిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రవి, సరళ, వెంకట్రామిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, శోభారాణి, వినోద, కోఅప్షన్‌ సభ్యుడు ఇక్బాల్‌, సర్పంచులు వెంకటే్‌షగౌడ్‌, సురేష్‌, వెంకట్‌రెడ్డి, శివశంకర్‌, కావేరి, యాదగిరి, మంగమ్మ, రమాదేవి, గీత పాల్గొన్నారు. 


రాష్ట్రాన్ని దేశంలోనే ముందుంచాం

తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ముందుంచామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో రూ.కోటి 85లక్షలతో చేపట్టిన భూగర్భ మురుగు కాల్వలు, సిమెంటు రోడ్లు, పైప్‌లైన్‌లతో పాటు వివిధ రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.   ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా భూగర్భ మురుగుకాల్వలు, సిమెంట్‌ రోడ్లు, వైకుంఠధామాలు, పార్కులను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నట్లు గుర్తుచేశారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేనంతగా పచ్చదనాన్ని పెంపొందించామన్నారు. హరితహారాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటినట్లు వివరించారు.


ఏరాష్ట్రంలో జరుగనంత అభివృద్ధిని తెలంగాణలో కేవలం ఆరు సంవత్సరాల్లో చేసి చూపించామన్నారు. నేడు వ్యవసాయ రంగంలోనూ దేశంలోనే ముందువరుసలో ఉన్నామని వివరించారు. రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే సాధ్యమని నిరూపించామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి, కమిషనర్‌ వసంత, మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ సింగిరెడ్డి రాంరెడ్డి, కౌన్సిలర్లు రమాదేవి,  వసంత, ఆంనేయులు, మల్లేష్‌, పద్మారావు, వెంకట్‌రెడ్డి, జహంగీర్‌, నర్సింగ్‌ రావు, రవీందర్‌, కో-ఆప్షన్‌ సభ్యులు సురేందర్‌రెడ్డి, అల్లె అరుణ, బి.అరుణ, నాయకులు బి.శ్రీనివాస్‌, జంగయ్యయాదవ్‌, హరిశంకర్‌, హరీష్‌, ఎస్‌.శ్రీనివాస్‌, సత్యనారాయణ, ఆండాలు, వీరేందర్‌, విజయ్‌, గోపాల్‌, మహిపాల్‌, శివ, యాదగిరి పాల్గొన్నారు.

Advertisement
Advertisement