హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం తెలంగాణ భవన్‌లో ఈ నెల 16న మంగళవారం జరుగనుంది. పార్టీ అధినేత, సీఎం చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ, తెలంగాణ రైతులను, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న తీరుతెన్నుల మీద చర్చించనున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణను టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం రూపొందించనున్నదని ఆ వర్గాలు తెలిపాయి.