టీఆర్‌ఎస్‌ నేతలకు అల్జిమర్ వ్యాధి వచ్చింది: దాసోజు శ్రవణ్‌

ABN , First Publish Date - 2021-06-18T21:15:44+05:30 IST

బంగారు తెలంగాణలో భూముల అమ్మకం ఏంటి? అని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో

టీఆర్‌ఎస్‌ నేతలకు అల్జిమర్ వ్యాధి వచ్చింది: దాసోజు శ్రవణ్‌

హైదరాబాద్: బంగారు తెలంగాణలో భూముల అమ్మకం ఏంటి? అని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎకానమీ పెంపుపై నిపుణులతో సమావేశం పెట్టాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్ తప్పుడు పనులు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 20 ప్రకారం గవర్నమెంట్ ట్రస్టీగానే పనిచేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలకు అల్జిమర్ వ్యాధి వచ్చిందని దాసోజు శ్రవణ్‌ ఎద్దేవాచేశారు. 


పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా, జిల్లా కేంద్రాల చుట్టు పక్కల అమ్మకానికి వీలుగా ఉన్న భూములనూ గుర్తించాలని మంత్రి వర్గ ఉప సంఘం అధికారులకు సూచించింది. భూముల అమ్మకం ద్వారా రూ.15వేల కోట్ల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

Updated Date - 2021-06-18T21:15:44+05:30 IST