హైదరాబాద్: ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ప్రసంగాలు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మెన్ బి.వినోద్ కుమార్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సంస్మరణ సభ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో రోశయ్య లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే మంత్రులే అదనంగా శ్రమించాల్సి వచ్చేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన అభిప్రాయాన్ని పక్కకు పెట్టి వాస్తవాలను నిక్కచ్చిగా అధిష్టానానికి చెప్పారని ఆయన పేర్కొన్నారు. రోశయ్య మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు.