ఖమ్మం: జిల్లాలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసే అవకాశం అన్ని ప్రభుత్వాల్లో కలిసి వచ్చిందని మాజీ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో ఈ ప్రాంతానికి భారీ ప్రాజెక్టు తెచ్చే అవకాశం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తనపై ఉన్న నమ్మకంతో అప్పగించిన బాధ్యతను జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కష్టపడ్డానని తెలిపారు. తన కష్టానికి అనుగుణంగా జిల్లాలో అక్కచెల్లెలు, అన్నదమ్ములు ఇస్తున్న అపూర్వ స్వాగతానికి జన్మజన్మల రుణపడి ఉంటానని చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం భగవంతుడు తనకు ఎంత శక్తి ఇస్తే అంత ఈ జిల్లా ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి