Advertisement
Advertisement
Abn logo
Advertisement

యాదాద్రి తర్వాత భద్రాద్రి నిర్మాణం: Tummala

భద్రాద్రి: భద్రాచలం శ్రీ సీతారామ కమ్మవారి సేవాసమితి ఆధ్వర్యంలో కల్యాణ మండపం, వసతి గృహా సముదాయానికి  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూమి పూజ  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కమ్మసేవా సమితి తలపెట్టిన ఈ  బృహత్తర కార్యాక్రమం భద్రాచలంకే తలమానికం కావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దమనసుతో నిధులు కేటాయించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల భూమిని సీతారాములతో సస్యశ్యామలం చేయనున్నారని తెలిపారు. యాదాద్రి తరవాత భద్రాద్రి నిర్మాణం కూడా పూర్తి చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని... త్వరలోనే అది కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. పదవులతో పని లేకుండా పదవిలో ఉన్నా లేకపోయినా  తాను ఎక్కడ ఉన్నా భద్రాద్రి క్షేత్రం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉమ్మడి జిల్లాకు, రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం ఆ శ్రీరామచంద్రుని దయతో కొనసాగుతుందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement