నిజామాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో టీఆర్‌ఎస్ నేత తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే వైఖరిపై మాక్లూర్ మండలం కల్లెడ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ మండిపడ్డారు. తన గ్రామాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తమపై ఎలా పెత్తనం చలాయిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని, ఖబడ్దార్ జీవన్ రెడ్డి అంటూ ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాలో ప్రసాద్ గౌడ్ వీడియో వైరల్ అవుతున్నది.
ఇవి కూడా చదవండి