Telangana News: కేంద్రంపై టీఆర్ఎస్ వ్యాఖ్యలు సరికాదన్న కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-07-21T01:22:03+05:30 IST

కేంద్రంపై టీఆర్ఎస్ (TRS) వ్యాఖ్యలు సరికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) తప్పుబట్టారు.

Telangana News: కేంద్రంపై టీఆర్ఎస్ వ్యాఖ్యలు సరికాదన్న కిషన్‌రెడ్డి

హైదరాబాద్: కేంద్రంపై టీఆర్ఎస్ (TRS) వ్యాఖ్యలు సరికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రైతులు, రైస్ మిల్లర్ల పరిస్థితిని కేంద్రానికి వివరించామన్నారు. డైరెక్టుగా FCI ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలితో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రాని సమస్యలు తెలంగాణ (Telangana)లోనే ఎందుకోస్తోందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ధర్నా చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. పేదలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యం 3నెలల నుంచి పంపిణీ చేయడం లేదని తప్పుబట్టారు. రానున్న రోజుల్లో రైస్ డిస్ట్రిబ్యూషన్, ప్రోక్యూర్మెంట్ చేయాలని, రాష్ట్రాలతో, రైస్ మిల్లర్లతో మాట్లాడామని తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.


Updated Date - 2022-07-21T01:22:03+05:30 IST