ధాన్యం పేరిట టీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోంది

ABN , First Publish Date - 2022-05-22T06:55:19+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్యం పేరిట టీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మినారాయణ ఆరోపించారు.

ధాన్యం పేరిట టీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోంది
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మినారాయణ

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యండల లక్ష్మినారాయణ 

నిర్మల్‌, మే 21 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్యం పేరిట టీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మినారాయణ ఆరోపించారు. శనివారం నిర్మల్‌లోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే9సీఆర్‌ యాసంగిలో వరిపంట సాగు చేయొద్దని ఒకవేళ సాగుచేస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొను గోలు చేయమని ప్రకటనలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నీటి సౌకర్యం ఉండి వరి సాగు చేసే అన్ని వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనతో రైతన్నలు వెనకడుగు వేసి తీవ్రంగా దెబ్బతిన్నారు. మరోపక్క తీరా యాసంగి పంట చేతికి వచ్చాక గతంలో తాము ధాన్యం కొనమని చెప్పాము. కాబట్టి ఇక కొనేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఈగో రాజకీయాలు చేసిందన్నారు. దీంతో ఏప్రిల్‌ ఒకటో తారీఖులోపు ప్రారంభం కావాల్సిన ధాన్యం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించడం ఆలస్యం అయిందన్నారు. మరోవైపు కేంద్రప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి రాజకీయ డ్రామా నడిపించే ప్రయత్నం చేశారన్నారు. మరోపక్క మిల్లర్లకు మిల్లింగ్‌ చార్జీలు ఇవ్వకపోవడంతో ఆ ప్రభావం రైతులపై పడి ధాన్యం కొనుగోళ్లలో అదనపు కోత విధిస్తున్నారని ఆరోపించారు. 40 కిలోల ధాన్యం బస్తా వెంట మూడు నుంచి ఐదుకిలోల వరకు అదనపు తూకాలు చేస్తే రైతన్నను ఈ ప్ర భుత్వం మోసగిస్తోందన్నారు. మరోపక్క స్థానికంగా ఏవైనా అవినీతి అక్రమా లు చోటు చేసుకుంటే చర్యలు చేపట్టాల్సిన అధికారులు ప్రజా ప్రతినిధులే ఈ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు మారుతున్నారని ఆయన ఆరోపిం చారు. నిర్మల్‌ జిల్లాలో కంచె  చేను మేసిన చందంగా స్థానిక మంత్రి మున్సి పల్‌ చైర్మన్‌ ఉద్యోగాల భర్తీలో లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారని తీవ్రంగా ఆరోపించారు. ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాలపై తాము లోకా యుక్తకు ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ అక్రమాలకు కారకు లైన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేయడంతో రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టు బడి సహాయం కింద ఎకరానికి 10 వేల చొప్పున అందజేస్తూ రైతులకు సబ్సిడీపై విత్తనాలు కోతపెట్టారని ఆరోపించారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంటే ఎరువుల సబ్సిడి పెంచూతు కేంద్రం రైతన్న కు అండగా నిలుస్తుందన్నారు. ఇకనైనా కేసీఆర్‌ ఈ డ్రామాలు ఆపి వాస్తవా ల్లోకి రావాలని హితవు పలికారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ వారికి సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు మెడిసెమ్మె రాజు, సామ రాజేశ్వర్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి కొరిపెల్లి శ్రావణ్‌ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్‌, పట్టణ అధ్యక్షుడు  సాధం అరవింద్‌, డాక్టర్‌ మల్లికార్జున్‌ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్‌, శ్రీరామోజు నరేష్‌, మహేందర్‌, నాయుడి మురళి, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T06:55:19+05:30 IST