టీఆర్‌ఎస్‌ పతనం ఖాయం : బీజేపీ

ABN , First Publish Date - 2021-03-07T06:00:32+05:30 IST

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతో చతికిలబడ్డ టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభమైందని, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది మరోసారి రుజువు కానుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కొవ లక్ష్మణ్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌ పతనం ఖాయం : బీజేపీ
మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడుతున్న ఇంద్రసేనారెడ్డి

నార్కట్‌పల్లి, మార్చి 6: దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతో చతికిలబడ్డ టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభమైందని, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది మరోసారి రుజువు కానుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కొవ లక్ష్మణ్‌ అన్నారు. నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నార్కట్‌పల్లిలో శనివారం ప్రచారం నిర్వహించారు. ఆరున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలన, కేసీఆర్‌ తీరుపై అన్ని వర్గాల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. రాష్ట్రంలో రెండేళ్ల పాటు అధికారంలో ఉంటామని ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు రెండేళ్లు అధికారంలో ఉంటామని గ్యారెం టీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పనలో ట్విట్టర్‌ పిట్ట కేటీఆర్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి టు లెట్‌ నుంచి ఫర్‌ సేల్‌కు దిగజారిందని, టీపీసీసీ అధ్యక్షుడు ఔట్‌సోర్సింగో లేక కాంట్రాక్ట్‌ పద్దతిన కొనసాగుతున్నారని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పాల్వాయి రజనీకుమారి, కంకణాల శ్రీధర్‌రెడ్డి, పీవీ శ్యాంసుందర్‌, యెన్నెం శ్రీనివా్‌సరెడ్డి, పోరెడ్డి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పల్లా ముక్కు నేలకు రాయాల్సిందే..

మిర్యాలగూడ టౌన్‌: ఓటమి భయంతో అబద్దాలాడుతున్న టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముక్కు నేలకు రాయాల్సిన రోజు దగ్గరలోనే ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాలివ్వకుండానే తప్పుడు లెక్కలు చెప్పి పవాల్‌ విసరడం సరి కాదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి చవి చూసిన గులాబీ దళానికి తమ పనైపోయిందనే భయం పట్టుకుందని విమర్శించారు. సమవేశంలో నాయకులు రవీంద్రనాయక్‌, శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - 2021-03-07T06:00:32+05:30 IST