Abn logo
Apr 11 2021 @ 01:15AM

హామీల అమలులో టీఆర్‌ఎస్‌ విఫలం : డీకే.అరుణ

హాలియా / గుర్రంపోడు, ఏప్రిల్‌ 10: టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ విమర్శించారు. శనివారం ఆమె అనుముల మండలంలోని ముక్కమాల, వెంకటాద్రిపాలెం, కొసలమర్రి, అన్నారం గ్రామాల్లో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. మీ గ్రామాల్లో ఒక్క ఇళ్లు అయినా కట్టారా యువకులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా అని ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్‌ఎ్‌సకు బీజేపీనే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందన్నారు. బలహీన వర్గానికి చెందిన రవినాయక్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆమె వెంట అజ్మీరబాబి, వీరేల్లి చంద్రశేఖర్‌, పాపయ్యగౌడ్‌, జంగయ్యయాదవ్‌, బైరు శంకర్‌, శంకర్‌ ఉన్నారు. గుర్రంపోడు మండలంలోని ఒట్టికోడు, పోచంపల్లి, కోయగూరోనిబావి, కొప్పోల్‌, బుడ్డరెడ్డిగూడెం గ్రామాల్లో  బీజేపీ రాష్ట్ర నాయకుడు వివేక్‌ ప్రచారం చేశారు. సాగర్‌ ఉప ఎన్నికలో రవినాయక్‌ గెలుపు ఖాయమన్నారు. ఈ ఎన్నికలో ఆ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల మండల ఇన్‌చార్జి శ్రీశైలంగౌడ్‌, హరీ్‌షరెడ్డి, రామచంద్రయ్య, వెంకట్‌నారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement