హైదరాబాద్ సిటీ/జవహర్‌నగర్ : ఎనిమిది నెలలుగా కేన్సర్‌తో బాధపడుతున్న జవహర్‌నగర్ కార్పొరేటర్ విశ్రాంతమ్మ(55) ఆదివారం కన్నుమూశారు. ఆమెకు భర్త రాబర్ట్, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నుంచి 35ఏళ్ల క్రితమే జవహర్‌నగర్‌కు వలసొచ్చిస్థిరపడ్డారు. వార్డు మెంబర్‌గా రాజకీయ ఆరంగ్రేటం చేశారు. గత ఎన్నికల్లో జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో స్వంతంత్ర అభ్యర్థిగా గెలిచారు. తర్వాత మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి మల్లారెడ్డి, మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు తదితరులు విశ్రాంతమ్మ పార్థీవదేహానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.