ఆ పథకంపై టీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలి: వంశీచంద్ రెడ్డి

ABN , First Publish Date - 2020-08-08T22:50:28+05:30 IST

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై టీఆర్ఎస్ నేతలు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లావంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా

ఆ పథకంపై టీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలి: వంశీచంద్ రెడ్డి

న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై టీఆర్ఎస్ నేతలు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లావంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలదోపిడీని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని చల్లా వంశీచంద్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే అసంబద్ధ వాదన ముందుకు తెస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే చిత్తశుద్ధి నిజంగా ఉంటే, బహిరంగ చర్చకు వొచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. తేదీ, సమయం, స్థలం ఎప్పుడైనా, ఎక్కడైనా, ప్రత్యక్షంగా ఐనా, కోవిడ్ పరిస్థితుల వల్ల వర్చ్యువల్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఐనా తాను సిద్ధమని చెప్పారు. సీనియర్ పాత్రికేయుడిని సమన్వయకర్తగా, మీ వేసులుబాటును బట్టి తేదీ, సమయం, స్థలం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎత్తిపోతల పథకంపై టీఆర్ఎస్ నేతలు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లావంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలదోపిడీని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని చల్లా వంశీచంద్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే అసంబద్ధ వాదన ముందుకు తెస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే చిత్తశుద్ధి నిజంగా ఉంటే, బహిరంగ చర్చకు వొచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. తేదీ, సమయం, స్థలం ఎప్పుడైనా, ఎక్కడైనా, ప్రత్యక్షంగా ఐనా, కోవిడ్ పరిస్థితుల వల్ల వర్చ్యువల్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఐనా తాను సిద్ధమని చెప్పారు. సీనియర్ పాత్రికేయుడిని సమన్వయకర్తగా, మీ వేసులుబాటును బట్టి తేదీ, సమయం, స్థలం చెప్పాలని డిమాండ్ చేశారు.


Updated Date - 2020-08-08T22:50:28+05:30 IST