టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం
ABN , First Publish Date - 2021-04-14T01:49:17+05:30 IST
సాగర్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో నియోజకవర్గంలో రాజకీయ
నల్గొండ: సాగర్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అనుములలో ప్రచారానికి వచ్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణను నివారించడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు.