Munugodu by poll: బీజేపీపై కేసీఆర్ ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రాలు ఫలిస్తాయా?

ABN , First Publish Date - 2022-08-21T01:18:52+05:30 IST

టీఆర్ఎస్‌ (Trs) ఆధ్వర్యంలో ప్రజాదీవెన సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ (Cm kcr).. ప్రధాని మోదీ (Modi), కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah)పై ...

Munugodu by poll: బీజేపీపై కేసీఆర్ ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రాలు ఫలిస్తాయా?

మునుగోడు: టీఆర్ఎస్‌ (Trs) ఆధ్వర్యంలో ప్రజాదీవెన సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ (Cm kcr).. ప్రధాని మోదీ (Modi), కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది జలాలను ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయమంటే మోదీ చేయలేదని తప్పుబట్టారు. తమ ప్రశ్నలకు అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడులో బీజేపీ (Bjp)కి ఎప్పుడూ డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవాచేశారు. ఈసారి బీజేపీకి ఓటు పడిందంటే.. బావి కాడ మీటర్లు ఉన్నట్టేనని హెచ్చరించారు. ప్రజల మద్దతుతోనే తాను మీటర్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని తెలిపారు.  మీటర్లు పెట్టే బీజేపీ కావాలా?, మీటర్లు వద్దనే టీఆర్‌ఎస్‌ కావాలా? అని జనాలను కేసీఆర్ ప్రశ్నించారు. ఈడీకి దొంగలు భయపడుతారని తామెందుకు భయపడతామన్నారు. బీజేపీ గోకినా.. గోకకపోయినా.. తాను గోకుతానని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ పాలనలో ఏ వర్గానికి మేలు జరిగిందని ప్రశ్నించారు. బ్యాంకులు, రైళ్లు, రోడ్లు అన్నింటినీ కేంద్రం అమ్మేస్తోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.



ఈ నేపథ్యంలో ‘‘కేసీఆర్ ఎత్తులకు బీజేపీ పై ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు తన్నుకుంటారా?.. తలపడతారా?. బీజేపీపై కేసీఆర్ ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రాలు ఫలిస్తాయా?. వ్యవసాయ మీటర్లను బూచిగా చూపించే ఎత్తుగడ పారుతుందా?. కమ్యూనిస్టులతో కలిసి మునుగోడును కొల్లగొడతారా?.కమ్యూనిస్టు విధానాలపై కామ్రెడ్లకు స్పష్టత ఉందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-08-21T01:18:52+05:30 IST