Abn logo
Oct 2 2020 @ 02:27AM

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి

 వినోద్‌


పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.


తన నివాసంలో టీఆర్‌ఎస్‌ లీగల్‌సెల్‌ ప్రతినిధులతో వినోద్‌ కుమార్‌ సమావేశమయ్యారు. ఓటర్‌ నమోదు కోసం లీగల్‌సెల్‌ ఆధ్వర్యంలో పట్టభద్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.  


Advertisement
Advertisement
Advertisement