టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు వాయిదా

ABN , First Publish Date - 2021-04-16T09:12:14+05:30 IST

టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాధి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది

టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు వాయిదా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి):  టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాధి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి ఈ నెల 27 నాటికి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని భావించారు. అయితే, ప్రస్తుతం కరోనా తీవ్రత..  మినీ మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఉత్సవాలను వాయిదా వేశారు.


మంత్రి ఎర్రబెల్లిని సత్కరించిన కేటీఆర్‌

ఈ-పంచాయతీలో రాష్ర్టానికి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుని గురువారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌  సత్కరించారు. ఇదే స్ఫూర్తితో  రాష్ర్టానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 12 జాతీయ అవార్డులు వచ్చినందుకు అభినందించారు. 

Updated Date - 2021-04-16T09:12:14+05:30 IST