Breaking: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్.. ఎవరెవరికి ఇచ్చారంటే..

ABN , First Publish Date - 2022-05-18T22:46:32+05:30 IST

టీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో డా.బండి పార్థసారధిరెడ్డి, ఖమ్మం జిల్లాకు..

Breaking: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్.. ఎవరెవరికి ఇచ్చారంటే..

హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో డా.బండి పార్థసారధిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర) పేర్లను రాజ్యసభ అభ్యర్థులుగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇద్దరు ఓసీ, ఒక బీసీ అభ్యర్థిని టీఆర్‌ఎస్ ప్రకటించింది. తెలంగాణకు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా మూడు స్థానాలనూ టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకోవడం లాంఛనమే. కాగా, ఇందులో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీనికి నోటిఫికేషన్‌ ఇప్పటికే జారీ అయింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 19తో గడువు ముగుస్తోంది. మిగిలిన రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల 24న జారీ కానుంది. రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఉప ఎన్నిక జరిగే స్థానానికి నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది.



Updated Date - 2022-05-18T22:46:32+05:30 IST