లండన్‌లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం!

ABN , First Publish Date - 2022-04-26T21:59:47+05:30 IST

ఎన్నారై టి.ఆర్.యస్ సెల్-యు.కే ఆధ్వర్యంలో లండన్‌లో టీఆర్ఎస్‌ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

లండన్‌లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం!

లండన్ : ఎన్నారై టి.ఆర్.యస్ సెల్-యు.కే ఆధ్వర్యంలో లండన్‌లో టీఆర్ఎస్‌ పార్టీ 21వ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ - యు.కే అధ్యక్షుడు అశోక్ గౌడ్  దూసరి అద్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమం లో తెరాస నాయకులు, తెలంగాణ వాదులు హాజరు హాజరయ్యారు. అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి TRS పార్టీ జండాను ఆవిష్కరించి, అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం..స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్  నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ 2001 నుండి తెరాస పార్టీ స్వరాష్ట్ర సాధనలో చేసిన ఉద్యమాలను సభకు గుర్తు చేసారు. అదే విధంగా స్వరాష్ట్రం కోసం ఉద్యమంలోనే కాకుండా బంగారు తెలంగాణా నిర్మాణంలోనూ అవకాశం కల్పించినందుకు టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. టి.ఆర్.ఎస్ పార్టీలో ఉండటం తమ అదృష్టమనీ, తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలే పునాదులుగా, అనుక్షణం రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 


ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చినందుకు తెరాస కార్యకర్త లకు కృతఙ్ఞతలు తెలిపారు. తెరాస ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పధకాలు, అభివృద్ధి పనులు గురించి సభకు వివరించారు. ఎన్నారైలంతా ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే ఉన్నారని , భవిష్యత్తులో కూడా తెరాస ప్రభుత్వాన్నే ఎన్నారైలంతా కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రవాస తెలంగాణ వాదులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి,  ప్రదాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, సంయుక్త కార్యదర్శులు మల్లా రెడ్డి, రమేష్ ఇస్సంపల్లి  అధికార ప్రతినిధులు రవి కుమార్ రేతినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి, నవీన్ మాదిరెడ్డి, ఈస్ట్ లండన్ ఇంచార్జి ప్రశాంత్ కటికనేని,  మధు ఆబోతు, ప్రవాస తెలంగాణ వాదులు మట్టా రెడ్డి, గణేష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.





Updated Date - 2022-04-26T21:59:47+05:30 IST