ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2021-05-05T05:20:24+05:30 IST

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీఆర్‌ఎస్‌

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీఆర్‌ఎస్‌
కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా పాల్గొన్న రావు పద్మ, బీజేపీ కార్పొరేటర్లు

 34వ డివిజన్‌ కౌటింగ్‌పై కోర్టును ఆశ్రయిస్తాం..

 బీజేపీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ

మట్టెవాడ, మే 4 : గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికారం, అక్రమాలతో ప్రజాస్వామ్యాన్ని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఖూనీ చేశారని బీజేపీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు ఆరోపించారు. అర్బన్‌ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో జరిగిన అవకతవకలను ఖండిస్తూ మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండు ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకుండా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి, కమలం గెలుచుకున్న ఫలితాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. డబ్బు, మద్యంతో ప్రజలను ప్రలోభాలకు గురి చేసిన అధికార పార్టీకి.. రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 

34వ డివిజన్‌లో బీజేపీ అఽభ్యర్థి గంటా రవికుమార్‌ నామినేషన్‌ను అకారణంగా తిరస్కరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డరని అన్నారు. నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అడుగడుగునా బీజేపీ అభ్యర్థులకు అటంకాలు కల్గించారని పేర్కొన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో నైతిక విజయం బీజేపీదేనని అన్నారు. ఎన్నికల నియామవళిని తుంగలో తొక్కిన అధికార పార్టీకి అధికారులు వంతపాడారని ఆరోపించారు. 34వ డివిజన్‌ ఫలితంపై కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ కార్పొరేటర్లు గురుమూర్తి శివకుమార్‌, చింతాకుల అనిల్‌, చాడ స్వాతిరెడ్డి, గుజ్జుల వసంత, జలగం అనిత, ఆడెపు స్వప్న పాల్గొన్నారు.

Updated Date - 2021-05-05T05:20:24+05:30 IST