ఈ బుడ్డోడు ఎంత పని చేశాడు.. ఆడుకుంటున్నాడులే అనుకుంటే తల్లి ప్రాణాలకే ఎసరు పెట్టాడు..!

ABN , First Publish Date - 2021-10-14T03:23:22+05:30 IST

నాలుగేళ్ల బుడ్డోడు చేసిన పని.. తల్లి ప్రాణాల మీదకు వచ్చిపడింది. చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా.. చివరికి ఆమె ఎలాగోలా ప్రాణాపాయం నుంచి బయటపడింది.

ఈ బుడ్డోడు ఎంత పని చేశాడు.. ఆడుకుంటున్నాడులే అనుకుంటే తల్లి ప్రాణాలకే ఎసరు పెట్టాడు..!

చిన్న పిల్లలను చూసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇక వారి అల్లరి గురించి చెప్పుకోవాలంటే అంతా ఇంతా కాదు. ఓపిక నశించినప్పుడు ఒక్కోసారి కోపం వచ్చినా.. తర్వాత వారి అల్లరి చూసి నవ్వుకోవడం సహజమే. ఇక్కడ ఓ నాలుగేళ్ల బుడ్డోడు చేసిన పని.. తల్లి ప్రాణాల మీదకు వచ్చిపడింది. చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా.. చివరికి ఆమె ఎలాగోలా ప్రాణాపాయం నుంచి బయటపడింది. చైనాలోని ఝియాంగ్షు ప్రావిన్స్‌లోని హుయిన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. 


 చైనాలో నివాసం ఉంటున్న ఆ దంపతులకు ఓ నాలుగేళ్ల బాలుడు ఉన్నాడు. అక్టోబర్ 7న బాలుడు ఆడుకుంటూ ఉన్నాడు. మరోవైపు తల్లి ఇంటి పనుల్లో మునిగిపోయింది. పిల్లల అల్లరికి హద్దంటూ ఉండదు కదా.. ఆడుకుంటున్న ఆ బాబుకు సడన్‌గా ఓ సైకిల్ లాక్ కనిపించింది. దాంతో ఆడుకోవడం మొదలెట్టాడు. ఆడుకునేవాడు ఆడుకోకుండా.. పనుల్లో బిజీగా ఉన్న తల్లిని విసిగించడం మొదలెట్టాడు. ఈ క్రమంలో సైకిల్ లాక్‌ను ఆమె మెడలో వేసి లాక్ చేశాడు. ఇంకేముందీ.. ఊహించని ఈ ఘటనతో ఆమెకు ఊపిరి ఆడనంత పనైంది. అన్‌లాక్ కోడ్ మారిపోవడంతో శతవిధాలా ప్రయత్నించినా లాక్ ఓపెన్ అవలేదు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని ప్రయత్నించారు. కానీ వారి వల్ల కూడా కాలేదు.


చేసేదేమీ లేక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆమె మెడకు ఎలాంటి గాయాలు కాకుండా కట్టర్‌‌ సాయంతో దాన్ని తీసేశారు. హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్న ఆ తల్లి.. తన కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలు ఆడుకునే సమయంలో వారిని కనిపెట్టుకుని ఉండాలని.. పలువురు నెటిజన్లు సూచించారు.



Updated Date - 2021-10-14T03:23:22+05:30 IST