అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఇబ్బందులు

ABN , First Publish Date - 2021-05-07T06:06:23+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు ఇంటింటికి తాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తే అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రజలకు నీరందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.

అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఇబ్బందులు
సమస్యలపై కాలనీ వాసులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌టౌన్‌, మే 6: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు ఇంటింటికి తాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తే అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రజలకు నీరందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్‌ హమాలీవాడలో మిషన్‌ భగీరథ పనులు పరిశీలించారు. గల్లీ గల్లీకి మిషన్‌ భగీరథ పైపులీకేజీలను పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులు, కాంట్రాక్టర్ల తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోపు లీకేజీలను తొలగించి ప్రజలకు సురక్షితమైన నీరు అందించాలని సూచించారు.

అందరికీ వ్యాక్సినేషన్‌..

జిల్లాలో కరోనా వైరస్‌ కేసుల ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందరికి వ్యాక్సినేషన్‌ ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో తీసుకోనుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. హమాలీవాడ ప్రాంతంలో పర్యటించిన ఆయన ప్రజలందరు కరోనా వైరస్‌ రాకుండా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. అత్యవసరమైన సందర్భంలోనే బయటకు రావాలని కోరారు. పట్టణంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. ఇందులో భాగంగానే వైద్యశాఖాధికారులు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సంబంధ విషయాల పై పరిశీలించడం జరుగుతుందన్నారు. అనంతరం కాలనీలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బండారి సతీష్‌, కౌన్సిలర్లు ప్రకాష్‌, నాయకులు గణేష్‌, నర్సింగ్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-05-07T06:06:23+05:30 IST